album cover
Inthandam
Alternative
Inthandam was released on March 13, 2026 by musickbyrohit as a part of the album Inthandam - Single
album cover
Release DateMarch 13, 2026
Labelmusickbyrohit
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM93

Credits

PERFORMING ARTISTS
Rohit
Rohit
Performer
COMPOSITION & LYRICS
Rohith Muddaraboina
Rohith Muddaraboina
Composer, Lyrics

Lyrics

ఇంతందం... ఏం చందం!
ఈ భావం... నాకే సొంతం!
గుండెల్లో మోగింది ఏదో తాళం
నీ వల్లే ఆగింది పరుగెత్తే కాలం
కనులకే దొరకని ఓ అద్భుతం
ఎదురుగా నిలిచెనే అది నీ రూపం!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
మాటలే రాని మౌనం... నాతోనే ఉందే
అడుగులే పడని వేగం... నీ వైపే లాగిందే
నిజమా ఇది కలయా... అడిగి చూసా నన్నే
బదులే లేని ప్రశ్నై... నిలిచా నీ ముందే!
రంగులన్నీ కరిగేలా... నవ్వి చూడకే అలా
ఊపిరంతా బరువయ్యే... దాచుకోకే వెన్నెల!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
గాలిలో తేలిపోనా... నీ జతలో చేరి
నిన్ననే మరిచిపోనా... నీ కధలో జారి
వంద ఏళ్ళు చాలవంట... నువ్వు పక్కనుంటే
స్వర్గమైనా చిన్నదంట... నీ ప్రేమ పొంటే!
నువ్వే నా ప్రపంచం... నువ్వే నా ఆనందం
మళ్ళీ మళ్ళీ చూస్తున్నా... తరగనంత ఈ అందం!
కాలాన్నే శాసించే... కళ్ళే నీవి
యుగాలకే అందని... కలలే మనవి
అలలతో పోటీగా... ప్రేమ పొంగెనే
శిలలలో ప్రాణమే... నిన్ను చూసి పొంగెనే
వదిలిపోదే క్షణం... నీ చేయి నా చేయి
కదిలిరావే ఇలా... మనసారా దరిచేరి!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
ఇంతందం... ఏం చందం!
ఈ భావం... నాకే సొంతం!
అరెరే... ఇంతందం... ఏం చందం
ఈ భావం... నాకే సొంతం!
Written by: Rohith Muddaraboina
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...