Credits

PERFORMING ARTISTS
Ilaiyaraaja
Ilaiyaraaja
Performer
Karthik
Karthik
Performer
Naani
Naani
Actor
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Anantha Sriram
Anantha Sriram
Lyrics

Lyrics

కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే

నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండ ఉన్నన్నాళ్లు
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్లు నిన్ను నేనే ఆరాధిస్తా నీ కోసమారాతీస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
ఏడు వింతలున్నన్నాళ్లు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు నీ నడకలాగ నేనుంటా కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్లు నీ గీతలాగ నేనుంటా జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లె బంధిస్తుంటా వంద ఏళ్లిలా హే హే హే హే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
భాషనేది ఉన్నన్నాళ్లు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు నీ వెనుక నేను వేచుంటా నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు నీ ముందుకొచ్చి నుంచుంటా నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు జ్ఞాపకంగ వెంటుంటా మళ్లీ మళ్లీ గురుతొస్తుంటా ముందు జన్మలా హే హే హే హే
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
గాలిలోన ఆరోప్రాణం కలవకుండ ఉన్నన్నాళ్లు నిన్ను నేనే ఆరాధిస్తా నీ కోసమారాతీస్తా
కోటి కోటి తారల్లోన చందమామ ఉన్నన్నాళ్లు నీ మనస్సులో నేనుంటానే
నీతి మీద ఆ కైలాసం తేలకుండ ఉన్నన్నాళ్లు నీ తపస్సు నే చేస్తుంటానే
Written by: Anantha Sriram, Ilaiyaraaja
instagramSharePathic_arrow_out

Loading...