Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
పగలే ఐనా గగనంలోన తారలు చేరెనుగా
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
Written by: Anantha Sriram, Mickey J Meyer
instagramSharePathic_arrow_out

Loading...