Credits
PERFORMING ARTISTS
Hemachandra
Performer
Srivardhini
Performer
Pawan Kalyan
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Ramajogayya Sastry
Songwriter
Lyrics
(जय बोलो शंकर महाराज की
बोलो काशीविश्वनाथ की
हरा हरा हरा हरा महादेव
जय बोलो शंकर महाराज की
बोलो काशीविश्वनाथ की
हरा हरा हरा हरा महादेव)
శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా
(जय बोलो शंकर महाराज की
हरा हरा महादेव)
జగమేలు శివశంకరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ
(जय बोलो शंकर महाराज की
हरा हरा महादेव)
జగమేలు శివశంకరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
(సనిపని సరి సనిపని సరి మపనిసా
సనిపని సరి సనిపని సరి మపనిసా
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి
సరిసని దనిపమ గమనిప మగరినిసా
సరిసని దనిపమ గమనిప మగరినిసా)
ఆరాధించే తొందర
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ
(जय बोलो शंकर महाराज की
हरा हरा महादेव)
జగమేలు శివశంకరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
Written by: Mani Sharma, Ramajogayya Sastry

