Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Priya Hemesh
Priya Hemesh
Performer
Murali
Murali
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

ముద్దుల మువ్వారావుగారి పెద్దమ్మాయి పద్దెనిమిదవ ఏట పైటేసుకుందంట డియ్యాలో డియ్యాల
చిన్నవీధి సక్కెల చిట్టెమ్మగారి చిన్నకోడలు నలభయ్యవ ఏట నీళ్లోసుకుందంట డియ్యాలో డియ్యాల
రంగుల రాజారావుగారి మూడవ అమ్మాయి పక్కింటి పుల్లారావుగారి నాలుగవ అబ్బాయితో
Jump-u జల్లాని అంట డియ్యాలో డియ్యాల
ఇంక వెనకింటి మంగతాయారు, గాజుల చిట్టెమ్మ, దుబాయి సత్యవతి
ఆల్లాల్లాళ్ళ మొగుళ్ళని వదిలేసారంట డియ్యాలో డియ్యాల
ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేనుగాని
ఆళ్ళ నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంట డియ్యాలో డియ్యాల
మొదలెట్టవే మంగతాయారు
అర్దరూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
ఒక్క రూపాయి ఇచ్చాడు sticker కొనుక్కోమన్నాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
రెండు రూపాయిలిచ్చాడు ribbon కొనుక్కోమన్నాడు
(డియ్యాలో డియ్యాల)
మూడు రూపాయిలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు
(డియ్యాలో డియ్యాల)
పది రూపాయిలిచ్చి Ponds powder కొనుక్కోమన్నాడు
నలభై రూపాయిలిచ్చి నఖిలి necklace కొనుక్కోమన్నాడు
అన్నీ కొనిచ్చి అలంకరించి ఐదు లక్షలకు బేరంపెట్టి
అసలేని పసలేని ముసలోడికి నన్నంమేసాడు
పిల్లా నీ బావనిస్తవా, తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తను
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనిస్తవా, ఏడి కాస్త చల్లారబెట్టుకొస్తను
(యాలో డియ్యాలో)
అమ్మో నా బావనిస్తనా, Junior షారుఖ్ ని జారనిస్తనా
అమ్మో నా బావనిస్తనా, ఇంకో కాజోల్ని చావనిస్తనా
వెనకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది
గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగలా వచ్చేస్తుందోయ్
గజ్జల సప్పుడు విన్నాడ ఎక్కడికెళ్ళావ్ అంటాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
గాజుల ఊపుడు విన్నాడ ఎవడికి సైగలు అంటాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
పక్కింటోడికి పులమారిందా నువ్వే తలిసావంటాడు
(డియ్యాలో డియ్యాల)
పొరిగింటోడికి జరమొచ్చిందా నీపై దిగులని అంటాడు
(డియ్యాలో డియ్యాల)
దోమకుట్టిందన్నాన, ఆడ? మగ? అంటాడు
పోనీ చీమకుట్టిందన్నాన, చిన్నా? పెద్దా? అంటాడు
వాడికి వీడికి link లు పెట్టి, ఉన్నవి లేనివి రంకులు కట్టి
శీలానికి సంకెళ్ళేసి సిలకే కొట్టని జాంపండైయ్యాను (అయ్యో పాపం)
పిల్లా నీ బావనిస్తవా, ఒక్కసారి చాటుకెళ్ళి లాటుగొస్తాను
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనిస్తవా, నా మొగుడుకున్న doubt లన్ని రైటు చేస్తను
(యాలో డియ్యాలో)
అమ్మో నా బావనిస్తనా, అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తనా
అమ్మో నా బావనిస్తనా, వాడికున్న తిక్క నీకు ఎక్కనిస్తనా
అరె జరగండి జరగండి జరగండి జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయి సత్యవతి
దుడ్డు కావాలన్నాడు, దుబాయి నన్ను పంపాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
Fridge TV కొంటానే పైసల్ పంపీమన్నాడు
(డియ్యాలో డియ్యాల డియ్యా డియ్యా డియ్యాల)
Sofa set కొంటానే సొమ్ములు పంపీమన్నాడు
(డియ్యాలో డియ్యాల)
Double cot కొంటానే డబ్బులు పంపీమన్నాడు
(డియ్యాలో డియ్యాల)
ఇయన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు
East phase లో కొంటానే ఇంకా పంపీమన్నాడు
Solid గా settle అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైటే దిగితే
East face ఇంటిలోన, double cot bed పైన
Second setup చూసి నేను upset అయ్యాను (తుస్స్)
పిల్లా నీ బావనిస్తవా, upset set చేసి తీసుకొస్తను
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనిస్తవా, దుబాయి scent బుడ్డిలోన ముంచుకొస్తను
(యాలో డియ్యాలో)
అమ్మో నా బావనిస్తనా, Oil బావిలోన దూకనిస్తన
అమ్మో నా బావనిస్తనా, వీడి జిడ్డు నీకు అంటనిస్తనా
ఓరిఓరిఓరిఓరి ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసుగాని
ఇదెవరో కొత్త బండిరా బాబు రైమంటూ గుద్దుకుంటూ వచ్చేస్తాంది
ఇలియనాకే ఈర్ష్య పుట్టే నడుమే నాదని అన్నాడు
(డియ్యాలో డియ్యాల)
ముమైత్ ఖాన్ కి దమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడు
(డియ్యాలో డియ్యాల)
శ్రేయాకే సెమటలుపుట్టే సోకే నాదని అన్నాడు
(డియ్యాలో డియ్యాల)
అనుష్కానే ఎనక్కినెట్టే సరుకే నాదని అన్నాడు
(డియ్యాలో డియ్యాల)
Front back చూసాడు mental ఎక్కి పోయాడు
Up down చూసాడు అప్పడం అయిపోయాడు
Face చూసి... (ఆ... face చూసి)
హే face చూసి freeze అయిపోయి, పార్టులు మొత్తం loose అయిపోయి
పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు
అబ్బో! అంత గొప్ప ఫేసా జర మాక్కూడా చూపించారాదే
పిల్లా నీ బావనిస్తవా, కంటి సూపుతోనే సప్పరిస్తను
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనిస్తవా, నోటిమాటతోనే నంజుకుంటను
(యాలో డియ్యాలో)
Okay నా బావనిస్తను, Junior షారుఖ్ ని జంట చేస్తను
నీకే నా బావనిస్తను, ఇంత అందగత్తె గాడు లేదంటాను
పిల్లా నీ బావనివ్వకు, నమ్ముకున్న తోడునెపుడు వీడనివ్వకు
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనివ్వకు, జీవితాన్ని మోడులాగా మారనివ్వకు
(యాలో డియ్యాలో)
Written by: Chandra Bose, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out

Loading...