Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Deepu
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Vennelakanti
Songwriter
Lyrics
దేవత నీవే నా దేవత నీవే
కను పాపగా కాస్త నిను నే రెప్పనై
నా జత నీవే ఇక నా జత నీవే
ఎడబాయక వుంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
దేవత నీవే నా దేవత నీవే
కను పాపగా కాస్త నిను నే రెప్పనై
చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
ఉలిలా నను తాకవో శిల్పాన్నవితాను
ని ఊపిరితో ఈ వెదురైనా వేణువు కాదా
ని చూపులోతో ఈ వేసవి లో వెన్నెల రాదా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగన
నీవే నేనై బ్రతకన
తలపుల తలుపులు తెరిచినా చెలి
జోరున కురిసే వానల్లో ఎండ్ నువ్వంట
నిప్పులు చెరిగే ఎండల్లో వాని నువ్వంట
ఏకాంతాన్నే వెలివేసి తోడే నువ్వంట
సోకాలాన్ని తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వులో పూచేతి పువ్వైపోనా
నీ నడకలో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెలో వెలిగే దీపము
పంచె తీయని తాపము
వలపుల పిలుపులు తెలిపిన మది
దేవత నీవే నా దేవత నీవే
కను పాపగా కాస్త నినునే రెప్పనై
నా జత నీవే ఇక నా జత నీవే
ఎడబాయక వుంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే
ఇది మన మనసుల కలయిక కదా
Written by: Mani Sharma, Vennelakanti