Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
K.S. Chithra
K.S. Chithra
Performer
Mahesh Babu
Mahesh Babu
Actor
Sonali Bendre
Sonali Bendre
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా
చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా
ఆగమ్మ అంటుంది ఒ మొహమాటం
నువ్వంటే మరి అదేదో ఇది
అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి
ఏలా నీకు చెప్పాలది
చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా
చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా
ఆగమ్మ అంటుంది ఒ మొహమాటం
వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్న
కంటికెదురు పడతావే ఏంటి ఎటు చూసినా
చెంప గిల్లి పోతావే ఏంటి గాలి వెలితోన
అంతా గొడవ పెడతావే ఏంటి నిద్దరపోతూ ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న
ఒంటిగ ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదెమ్ అల్లరి భరించెదెల
అంటు నిన్నెల కసరను
నువ్వేం చేసినా బాగుంటుందని
నిజం నీకెలా చెప్పను
చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా
చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా
ఆగమ్మ అంటుంది ఒ మొహమాటం
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైన
ఏడిపించ బుద్ధవుతుంది యెట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్న
కాస్త కస్సుమనావే ఎంత కవ్వించిన
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ వున్నా
లేని పోని ఉక్రోషంతో ఉడుకెత్తన
ఇదేం చూడక మహా పోసే తో
ఏటో నువ్వు చూస్తూ వున్నా
అదెంటో మరి ఆ పొగరే నచ్చి
పడి చస్తున్నా అయ్యో రామా
చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా
చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా, తప్పమ్మా
ఆగమ్మ అంటుంది ఒ మొహమాటం
నువ్వంటే మరి అదేదో ఇది
అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి
ఏలా నీకు చెప్పాలది
చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా
ఐ లవ్ యూ చెప్పేసేయి అంటోంది ఓ ఆరాటం
I love you, i love you, i love you, i love you
I love you, i love you
Written by: Chembolu Seetharama Sastry, Mani Sharma, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...