album cover
Alanati Ramachandrudu (From "Murari")
album cover
Alanati Ramachandrudu (From "Murari") was released on August 20, 2015 by Aditya Music as a part of the album Sree Rastu Shubhamastu Telugu Marriage Songs
BPM190
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

అలనాటి రామ చంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువంది
తెలుగుంటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జానా
తెలుగుంటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జానా
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నెలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల పోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతు పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలుపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కలకల జంతని పదిమంది చూడండి
తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలెయ్యండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నెలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల పోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన
గౌరీశంకర్ ఉల్లేఖమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మధుని ఒల్లు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకోని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నెలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల పోవమ్మా
Written by: Mani Sharma, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...