Credits
PERFORMING ARTISTS
Sudha
Performer
Revathi
Performer
COMPOSITION & LYRICS
Paradesi Panthagani
Songwriter
Lyrics
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
తనరారు దినకరు పెనుతారలను మించు
తనరారు దినకరు పెనుతారలను మించు
ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ వీవు
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
దోసంబులను మడియు – దాసాళిన్ గరుణించి
దోసంబులను మడియు – దాసాళిన్ గరుణించి
యేసు పేరున జగతికేగుదెంచితి నీవు
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
కెరుబులు సెరుపులు మరి దూతగణములు
కెరుబులు సెరుపులు మరి దూతగణములు
నురుతరంబుగన్ గొలువ నొప్పు శ్రేష్ఠుడ వీవు
కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను
Written by: Paradesi Panthagani, Pranam Kamlakhar