音乐视频

音乐视频

制作

出演艺人
Satya Yamini
Satya Yamini
表演者
作曲和作词
Gopi Sundar
Gopi Sundar
作曲
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
词曲作者

歌词

తను వెతికిన తగుజత నువ్వేనని
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని
వెలుగేదో కనిపించేలా
నిన్నే గుర్తించేలా
చుట్టూ కమ్మే రేయో మాయో
మొత్తం కరగాలి
ఒట్టు అంటూ నమ్మించే
నీ స్నేహం కావాలి
తను వెతికిన తగుజత నువ్వేనని
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని
ఉరికే అల్లరి ఉడికే ఆవిరి
ఎవరూ నా సరి లేరను వైఖరి
పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి
వలదనుకో వరమనుకో వరకట్నాలివి
ఒడుపుగ వరస కలిపి
మహాశయా మగువనేలుకో
నిను కలవక గడవదు కద కాలము
నిను కలవక నిలవదు కద ప్రాణము
కన్య కళ్యాణికి కళ్ళెము వేయవా
అతిగారానికి అణకువ నేర్పవా
కసురుకొనే కనుబొమ్మలో కలహమోడనీ
బిడియపడే ఓటమిలో గెలుపును చూడనీ
చెలియక చెలిమి కలిపి తలపు
తడిమి తడిని తెలుసుకో
అదుపెరుగని దివిగంగని నేనట
అతిశయమున ఎగసిన మది నాదట
ఒడుపెరిగని శివుడవు నీవేనట
జడముడులతో నిలుపద నను నీ జత
పనిమాలా బ్రతిమాలాలా
ప్రేమా పలకవదేల
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టువిడుపు లేనేలేని పంతం ఇంకానా
Written by: Gopi Sundar, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...