制作
作曲和作词
Sirivennela Seetharama Sastry
词曲作者
歌词
సదా నన్ను నడిపే నీ చెలిమే
పూదారై నిలిచే
ప్రతీ మలుపు ఇకపై స్వాగతమై
నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా
ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీకోసమై
కాలం నర్తించదా నీతో జతై
నదికి వరదల్లే మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
తలపు తుదిజల్లై, తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో
గమనించేలోగా
గమకించే రాగాన
ఏదో వీణ లోన మోగెనా
కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించదా నీకోసమై
కాలం నర్తించదా నీతో జతై
Written by: Mickey J Meyer, Sirivennela Seetharama Sastry