歌词
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో
తొలి తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో నన్నయితే జోకొట్టింది
ఓ మాయా అమ్మాయా
నువ్వే లేక లేనులే మాయా
ఓ మాయా అమ్మాయా
నువ్వే లేక లేనులే మాయా
వెలిగే దీపం సిందూరమే
మెడలో హారం మందారమే
ఎదనే తడిమెను నీ గానమే
పరువం పదిలం అననే అనను
వీచే గాలి ప్రేమే కదా
శ్వాసై నాలో చేరిందిగా
ఎదకే అదుపే తప్పిందిగా
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం మైకం
తొలి తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో నన్నయితే జోకొట్టింది
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో, ఏమో, ఏమో, ఏమో, ఏమో, ఏమో
ఓ మాయా అమ్మాయా
నువ్వే లేక లేనులే మాయా
ఓ మాయా అమ్మాయా
నువ్వే లేక లేనులే మాయా
నాతో నాకే ఓ పరిచయం
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసింది ఒక్కో క్షణం
జగమే సగమై కరిగెనేమో
హృదయం ఉదయం నీ చూపుతో
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం మైకం మైకం
Written by: Krishna Chaitanya, Thaman S.


