制作

出演艺人
Udit Narayan
Udit Narayan
表演者
Kousalya
Kousalya
表演者
作曲和作词
Chakri
Chakri
作曲
Bhaskara Bhatla
Bhaskara Bhatla
词曲作者
Bhaskarabhatla
Bhaskarabhatla
作词

歌词

లేలేత నవ్వుల పింగాణి బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల, కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ
కోలో కోలో రామ నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా, బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల, కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా
దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా
ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా
అది చేసింది ఎంత చొరవ
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో
నిను చూసినాక నా మనసు ఆపతరమా
నీ కాలిమువ్వనైపోనా
నువ్వు ఊగేటి ఊయలై రానా
నీ పూలపక్కనైపోనా
తమలపాకుల్లో వక్కనై రానా
గోదారి తీరమా, మంజీర నాదమా
కవ్వింతలెందుకే హాయ్ రామా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల, కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా
మరి గిల్లి గిచ్చెయ్ తేరగా
అగ్గే రేగింది నాలో చూశావుగా
అది చేసింది ఎంత గొడవ
చిరుచీకటింట చేరాలి కొంటెతనమా ఓ
దరిచేరినాక పులకించు పూలవనమా
నీ గోటిగాటునైపోనా
మరి నీ గుండెగూటికే రానా
ఆ గోరువంకనైపోనా
చెలి ఈ వాగువంకనై రానా
నాలోని భాగమా, ఆ నీలిమేఘమా
ఇచ్చాక ఎందుకో హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల, కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ
కోలో కోలో రామ నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా, బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మలా
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల, కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
Written by: Bhaskara Bhatla, Bhaskarabhatla, Chakri
instagramSharePathic_arrow_out

Loading...