Lyrics

క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ముక్తి విధాతనేత - శక్తి నొసంగుదాత భక్తి విలాపశ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి - దైవంబు తోడుబాసి దాసుని రూపుదాల్చి - ధరణి కేతెంచెగాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి - సత్యామృతంపురాశి శాప భారంబు మోసి - శ్రమల సహించెగాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప - రుథిరంబు గార్చెగాన మృత్యువు ముల్లు తృంపన్ – నిత్యజీవంబు బెంపన్ మర్త్యాళిభయము దీర్పన్ – మరణంబు గెలిచెగాన పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన ||క్రీస్తే||
Writer(s): Pranam Kamlakhar, Ravuri Ratnam Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out