म्यूज़िक वीडियो
म्यूज़िक वीडियो
क्रेडिट्स
PERFORMING ARTISTS
Kailash Kher
Performer
Vishnupriya Ravi
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Chandrabose
Lyrics
गाने
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా... మధ్యలో వదలొద్దురా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
వెళ్ళే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక... ఆగకుండా సాగాలిరా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం
ఓ' ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
Written by: Chandra Bose, Devi Sri Prasad

