Video Musik

Video Musik

Dari

PERFORMING ARTISTS
Sandeep
Sandeep
Performer
Kousalya
Kousalya
Performer
COMPOSITION & LYRICS
Chakri
Chakri
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lirik

హే లాలా హే లాలా
లల లలలా లాలా లల లలలా లాలా లల
నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
మొన్నా నిన్నా తెలియదె అసలూ
మొన్నా నిన్నా తెలియదె అసలూ మదిలోన మొదలైన ఈ గుసగుసలూ
ఏం తోచనీకుంది తియ్యని దిగులూ
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కోరిన వరమా
ఎందాక సాగాలి ఈ పయనాలూ
ఏ చోట ఆగాలి నా పాదాలూ
నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ఎన్నో విన్నా జంటల కథలూ
ఎన్నో విన్నా జంటల కథలూ నను తాకనే లేదు ఆ మధురిమలూ
కదలించనే లేదు కలలూ అలలూ
గత జన్మలో తీరని ఋణమా నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసతో నిన్ను పెంచిందేమో
నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Written by: Chakri, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...