album cover
Chilaka
10,637
Telugu
Chilaka was released on January 19, 2024 by Vijai Bulganin as a part of the album Chilaka - Single
album cover
Release DateJanuary 19, 2024
LabelVijai Bulganin
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM59

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Vijay Bulganin
Vijay Bulganin
Performer
Lakshmi Meghana
Lakshmi Meghana
Performer
COMPOSITION & LYRICS
Vijay Bulganin
Vijay Bulganin
Composer
Suresh Banisetti
Suresh Banisetti
Songwriter

Lyrics

కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే
ఏవే ఏవెవరరే నిన్నటి కలలు
లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేనులే
వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా
సుడిగాలి వేగంతో నీ వైపే వస్తున్నా
ఏ దారి మూస్తున్నా
ఏ దాడి చేస్తున్నా
ప్రాణాలే తీస్తున్నా
నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా
చిలకా ఓ రామచిలకా
చెరిగేది కాదే ఎదపై
నీ ముద్దు మరకా
చిలకా ఓ రామచిలకా
ఆరేది కాదే రగిలే
ఈ ప్రేమ తునకా
నా ఆశలకే ఆయువిమ్మని
నా ఊహలకే ఊపిరిమ్మని
నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం
నీ కంటపడే వీలు లేదని
నీ వెంట వచ్చే దారి లేదని
నా జీవితమే జారుతోందని
ఎలా తెలుపడం
ఒక్క పూట ఉండలేకపోయా
నువ్వు లేక వందేళ్లెట్టా గడపాలిక
కన్న కలలే కట్టుకధలాగా మార్చినది
కాలానికే దయ లేదుగా
చిలకా ఓ రామచిలకా
చెరిగేది కాదే ఎదపై
నీ ముద్దు మరకా
చిలకా ఓ రామచిలకా
ఆరేది కాదే రగిలే
ఈ ప్రేమ తునకా
ఆ వెన్నెలనే అడిగి చూసా
ఈ వేకువనే అడిగి చూసా
నీ జాడనే చూసి చెబుతాయేమో అని
ఈ గాలితో కబురు పంపా
మేఘాలతో కబురు పంపా
నా వేదనే నీకు వివరించాలి అని
ఈ కాలం పైన కత్తి దుయ్యాలనుంది
నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు
నా దేహం పైన మట్టి పొయ్యాలనుంది
నాకు నీతో రాసి పెట్టనందుకూ
చిలకా ఓ రామచిలకా
ఓ రామచిలుకా
కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా
కాసేపు నిన్ను చూడకుంటే
ఏవే ఏవెవరే నిన్నటి కలలు
లేవు లేవులే
నా చిన్ని గుండెల్లోనా
ఎండమావి చేరిపోదా
నీ నవ్వే నాకు దూరమైతే
ఏంటి ఏంటి ఇది
ఇంతటి బరువు మోయలేనులే
వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా
వెళ్లాలని లేకున్నా భారంగా వెళ్తున్నా
నువ్వెంత రమ్మన్నా రాలేను అంటున్నా
నేనంటూ ఏమైనా
నువు క్షేమంగుంటే చాలనుకుంటున్నా
చిలకా ఓ రామచిలకా
నా మనసే నీకు
ఎపుడో ఇచ్చాను గనకా
చిలకా ఓ రామచిలకా
జత రావొద్దంటే
అలుపే ఒంటరి నడకా
Written by: Suresh Banisetti, Vijai Bulganin
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...