Credits
PERFORMING ARTISTS
Sathya Prakash
Performer
Ajith Kumar
Actor
Siva
Music Director
Nayana Thara
Actor
COMPOSITION & LYRICS
D. Imman
Composer
Ramajogayya Shastri
Lyrics
Lyrics
చిన్నారి తల్లి చిన్నారి తల్లి
నా నింగి జాబిలి
నీ వెన్నెలంది వెలుగొందుతోంది
నా గుండె లోగిలి
నీ ఊసులోనే ముసురాడుతోంది
ఈ నాన్న ఊపిరి
కాలాలు దాటి ఏనాటికైనా
చేరాలి నీ దరి
ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ
ఏకాకి మాదిరి
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
చిన్నారి తల్లి చిన్నారి తల్లి
నా నింగి జాబిలి
నీ వెన్నెలంది వెలుగొందుతోంది
నా గుండె లోగిలి
కను చివరన జారే
తడి చినుకును సైతం
సిరి తలుకుగ మార్చే చిత్రం నీవే
కలతగ పొల మారే
ఎద మంటల గ్రీష్మం
సులువుగ మరిపించే మంత్రం నీదే
నువ్వంటే నా సొంతమంటూ
పలికిందీ మమకారం
ఆ మాట కాదంటూ
దూరం నిలిపిందీ అహంకారం
తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా
నిండు నూరేళ్ళ లోటు
తీరిపోదా అదే క్షణాన
చిన్నారి తల్లి చిన్నారి తల్లి
నా నింగి జాబిలి
నీ వెన్నెలంది వెలుగొందుతోంది
నా గుండె లోగిలి
నిదురించు వేళ నీ నుదుట నేను
ముత్యాల అంజలి
జోలాలి పాడి తెరిచాను చూడు
స్వప్నాల వాకిలి
ఏ బూచి నీడ నీపై
రానీకుండా నేనేగ కావలి
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
ఆరారిరారో రారో రారో ఆరారిరారో
చిన్నారి తల్లి చిన్నారి తల్లి
Written by: D. Imman, Ramajogayya Shastri

