album cover
Keeravaani
3,039
Telugu
Keeravaani was released on January 1, 2001 by Aditya Music as a part of the album Swayamvaram (Original Motion Picture Soundtrack) - EP
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM82

Credits

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
Swarnalatha
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
Vandemataram Srinivas
Vandemataram Srinivas
Composer
Bhuvana Chandra
Bhuvana Chandra
Songwriter

Lyrics

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో ఒనికిందోక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట
నిన్ను తాకి పొంగిపోవు
నీలి మబ్బుని నేనంట
వానలా వచ్చి వరదలా
పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందోక హృదయం
కొత్త కొత్త ఉహాలతో ఒనికిందొక అధరం
మంచు వెన్నెల స్నానమాడిన
మల్లె పందిరిలో
వలపు వాకిట వేచి నిలిచిన
వయసు పల్లకిలో
ఏకాంత సేవకు ఉర్రూతలూగిన
శృంగార శిల్పానివా
కళ్యాణ రాముని కౌగిట్లో
ఒదిగిన బంగారు పుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా
తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా
కీరవాణి రాగంలో పిలిచిందోక హృదయం
కొత్త కొత్త ఉహాలతో ఒనికిందొక అధరం
కదనసీమకు కాలు దువ్విన
గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటువేయకు
చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ
పొదిగిన వయ్యారి ముందుండగా
మందార పెదవుల గంధాలు
తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా
ఏకమై ఘాటుగా అలవాటుగా
తెరచాటుగా భామా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో ఒనికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట
నిన్ను తాకి పొంగిపోవు
నీలి మబ్బుని నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు
ప్రేమవే నీవా
మెరుపులా మైమరుపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఉహాలతో ఒనికిందొక అధరం
Written by: Bhuvana Chandra, Vandemataram Srinivas
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...