Credits

PERFORMING ARTISTS
Jikki
Jikki
Performer
Sunitha
Sunitha
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును
చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా
లేవని వెలవెలబోవమ్మా
పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ
పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను
చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపిన
తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని
పదిమంది చూడంది
తళతళ మెరిసిన ఆనందపు
తడి చూపుల అక్షితలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును
చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా
లేవని వెలవెలబోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు
ఈ పెళ్లి మండపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్లు
ఈ చల్లని సమయాన
దేవుళ్ల పెళ్లి వేడుకలైనా
ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ల పెళ్లి వేడుకలైనా
ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి
జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక
బంధువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును
చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా
లేవని వెలవెలబోవమ్మా
Written by: Mani Sharma, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out

Loading...