歌词

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి
Writer(s): R.p. Patnaik, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out